అధ్యాత్మ సంకీర్తన
రేకు: 263-5
సంపుటము: 3-365
రేకు: 263-5
సంపుటము: 3-365
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: మాళవి
| వీఁడు గదే శేషుఁడు శ్రీవేంకటాద్రిశేషుఁడు వేఁడుక గరుడనితోఁబెన్నుద్దైన శేషుఁడు | ॥పల్లవి॥ |
| వేయివడిగెలతోడ వెలసిన శేషుఁడు చాయమేని తళుకు వజ్రాల శేషుఁడు మాయని శిరసులపై మాణికాల శేషుఁడు యే యెడ హరికి నీడై యేఁగేటి శేషుఁడు | ॥వీఁడు॥ |
| పట్టపు వాహనమైన బంగారు శేషుఁడు చుట్టు చుట్టుకొనిన మించుల శేషుఁడు నట్టుకొన్న రెండువేలునాలుకల శేషుఁడు నెట్టన హరిఁబొగడ నేరుపరి శేషుఁడు | ॥వీఁడు॥ |
| కదిసి పనులకె ల్లఁ గాచుకున్న శేషుఁడు మొదల దేవతలెల్లా మొక్కే శేషుఁడు అదె శ్రీవేంకటపతి కలమేలుమంగకును పదరక యేపొద్దూ పానుపైన శేషుఁడు | ॥వీఁడు॥ |


