అధ్యాత్మ సంకీర్తన
రేకు: 264-1
సంపుటము: 3-367
రేకు: 264-1
సంపుటము: 3-367
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: శుద్ధవసంతం
| కడనుండే విజ్ఞానికిఁ గా దిటువలెను వొడలి రోఁతలు చూచి వూరకైనా నవ్వును | ॥పల్లవి॥ |
| ఆఱడిఁ బాము గరచినట్టివాఁడు దినఁబోతే జాఱని వేఁప చేఁదైనాఁ జప్పనై తోఁచు వీఱిడై సంసారపువిష మెక్కినవానికి చూఱలై హేయకాంతలు సుఖములై తోఁచును | ॥కడ॥ |
| చెంగట వెఱ్ఱివానికి చేసిన చేఁతలెల్ల తొంగలించి వివేకాలై తోఁచినట్లు మింగుచుఁ గర్మపు నాము మేసిన సంసారికి అంగడి కర్మమే బ్రహ్మమై తోఁచును | ॥కడ॥ |
| జగమిది యొక్కటే చవులు వేరేవేరే మొగి నెఱుకమఱపు ముడిచున్నది పగటు శ్రీవేంకటేశుఁ బట్టి కొలువనివాఁడు తెగని మాయలలోనఁ దేలాడవలసె | ॥కడ॥ |


