అధ్యాత్మ సంకీర్తన
రేకు: 268-4
సంపుటము: 3-392
రేకు: 268-4
సంపుటము: 3-392
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: భూపాళం
| నారాయణ నే నస్వతంత్రుఁడను నాకా పనిగాదేవియును ధారుణి లోపలఁ బుట్టించితివి తరువాతి పనులు నీకే సెలవు | ॥పల్లవి॥ |
| శ్రీపతి నీకే సమర్పితంబై శేషంబైనది యాతుమ దొల్లే యేపున విషయములందులోఁ దగిలి యేమయిన నీకే సెలవు చూపరఁ బసురము తొరలు వోయినను సొమ్ముగలుగువాఁడే పరవంజుక పైపైఁ దానే వెదకి తెచ్చి కాపాడఁగ నతనికి భారముగాన | ॥నారా॥ |
| యీడులేక శ్రీహరి నీవుండెడి యీ దేహపు నీపరికరమూఁ బాడిగఁ బంచేంద్రియములు పట్టుక బడిఁ దిప్పెడి నీకే సెలవు వోడక యధికులు తమ దాసులు మరివొకరిపంపు లటు సేయఁగను చూడరు తమబలములనే విడిపించుక తామే రక్షింతురు గాని | ॥నారా॥ |
| శ్రీవేంకటపతి నీవే నన్నిటు సృష్టించిన జీవుఁడనింతే కావిరి నజ్ఞానము నన్నిటువలెఁ గప్పిన నది నీకే సెలవు ధావతిఁ దలిదండ్రులు తమ బిడ్డల తనువులఁ బంకము లంటినను యేవిధముల నీరార్చి పెంతు రటు ఇన్నిట నీవే గతినాకు | ॥నారా॥ |


