Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 268-6
సంపుటము: 3-394
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: భూపాళం
పాపముఁ బుణ్యముఁ బరకట నున్నది
చేపట్టుము నీ చేతిదీ ప్రాణి
॥పల్లవి॥
నాలుక కొనలనె నానుచునున్నది
గాలపు నిజమునుఁ గల్లయును
వాలుచును తాసువలె నున్నదిదె
తాలిమి ధర్మాధర్మములు
॥పాప॥
చేతుల కొనలను చేఁతై యున్నది
జాతిగ నరకము స్వర్గమును
ఆతల వేదోక్తమైన కర్మములు
దాతనె పిడికిటఁ దగిలెను వెదకు(?)
॥పాప॥
మనసు కొట్టఁగొన మాయయు నున్నది
వెనక శ్రీవేంకటవిభుఁడు నదే
తనరిన యాతని దాస్యము నున్నది
విని చేకొందువు వెదకవో నీవు
॥పాప॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము