అధ్యాత్మ సంకీర్తన
రేకు: 269-3
సంపుటము: 3-397
రేకు: 269-3
సంపుటము: 3-397
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: బౌళి
| ఇదె చిక్కితివిఁక నెందు వోయెదవు వుదిరి తొలఁగరా దోహో నీవు | ॥పల్లవి॥ |
| జీవుల లోపలఁ జెలఁగేటి మూర్తివి దేవతలకు పరదేవుఁడవు కైవల్యమునకుఁ గలుగు బ్రహ్మమవు ఆవలి పరమున కర్థమవు | ॥ఇదె॥ |
| ఘనకర్మమునకుఁ గలిగిన ఫలమవు మనసు లోనికిని మాయవు తనియని చదువుకు దాఁచిన ధనమవు మునుప జగములకు మూలమవు | ॥ఇదె॥ |
| వలసినవారికి వర్ణించు రూపవు(???) సులభులకు సంసారసుఖమవు అలరిన దాసులమగు మాకైతే కలిగిన శ్రీవేంకటపతివి | ॥ఇదె॥ |


