అధ్యాత్మ సంకీర్తన
రేకు: 270-3
సంపుటము: 3-403
రేకు: 270-3
సంపుటము: 3-403
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: సామంతం
| కడుపు నిండె నిఁకఁ గడమేది । మును తడవిన యపుడే నే ధన్యుఁడనైతి | ॥పల్లవి॥ |
| హరిహరి యని నే నన్ననాఁడె నా- పరగిన జన్మము ఫలియించె కెరలి మీఁద మిక్కిలి నీసేవలు వరుస జలధిలో వానలు | ॥కడు॥ |
| ముందర నీకును మొక్కినయపుడే అందితిఁ దుదిపదమగు సుఖము పొందుగ మీఁదటి వేవేలు సేవలు యెందును శ్రీమంతు కిచ్చిన సిరులు | ॥కడు॥ |
| శ్రీవేంకటపతి శరణనినపుడే దైవమ నాపాల దక్కితివి చేవలఁ గమ్మర సేవించు సేవలు వేవేలు పూజల వేడుకలు | ॥కడు॥ |


