అధ్యాత్మ సంకీర్తన
రేకు: 271-1
సంపుటము: 3-406
రేకు: 271-1
సంపుటము: 3-406
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: సామంతం
| ఎవ్వరి దూరఁగనేల యేమీ ననఁగనేల నవ్వుచు హరికి మొక్కి నడచుటఁ గాక | ॥పల్లవి॥ |
| కోపమే యెక్కుడు సేసు కొందరి గుణములోన పాపమే యెక్కుడు సేసు పరులఁ గొందరికి దీపన మెక్కుడు సేసు దేహములఁ గొందరికి శ్రీపతి ఆనాజ్ఞ లివి చెల్లీ లోకానను | ॥ఎవ్వ॥ |
| కొందరి నసురలఁగా గుట్టుతోడ నటు సేసు కొందరి దేవతలఁగా కోరి తానే యిటు సేసు కొందరి మనుజులఁగా కూటపు జీవులఁ జేసు విందువలె హరిమాయ వెలసి లోకానను | ॥ఎవ్వ॥ |
| వరుస నెరిఁగి నడవ నెవ్వరి కిచ్చగాదు సరిని వనాది నుండే సహజమే కలది చిరపుణ్యు లిన్నిటిలో శ్రీవేంకటేశుఁ గని శరణనఁగా సుఖము జరగీ లోకానను | ॥ఎవ్వ॥ |


