అధ్యాత్మ సంకీర్తన
రేకు: 271-2
సంపుటము: 3-407
రేకు: 271-2
సంపుటము: 3-407
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: గుండక్రియ
| పొదలఁ బొదలఁగఁ దనువు పుణ్యపాపముపొత్తు వదల వదలఁగ మనసు వద్దనే నిలుచు | ॥పల్లవి॥ |
| పెరుగు నింద్రియసుఖము పెంచఁగాఁ బెంచఁగా ధరఁ బెరుగుఁ గోరికలు తలఁచఁ దలఁచ కెరలు లంపటము మిక్కిలి కూర్చుఁ(ర్చఁ?) గూర్చఁగా మరలింప మరలింప మనసులో నణఁగు | ॥పొద॥ |
| కలుగు పనులే మైనఁ గడుఁ జేయఁ జేయఁగా మలసి కలుగును రుచులు మరుగ మరుగ బలియు నజ్ఞానంబు భ్రమయఁగా భ్రమయఁగా నిలువ నిలువఁగ మనసు నిశ్చలం బవును | ॥పొద॥ |
| నెగడు గుణములు పెక్కు నించఁగా నించఁగా మిగుల(లు?) సంసారంబు మెలఁగ మెలఁగ తగిలి శ్రీవేంకటేశు దగ్గరి కొలువఁగఁ గొలువ పొగడఁ బొగడఁగ నతఁడు పొంతనే నిలుచు | ॥పొద॥ |


