అధ్యాత్మ సంకీర్తన
రేకు: 26-6
సంపుటము: 1-161
రేకు: 26-6
సంపుటము: 1-161
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: నాట
| మందులేదు దీనికి మంత్ర మేమియు లేదు మందు మంత్రము దన మతిలోనే కలదు | ॥మందు॥ |
| కదలకుండఁగఁ దన్నుఁ గట్టివేసినఁ గట్టు వదలించకొనఁ గొంత వలదా వదలించఁబోయిన వడిగొని పైపైనే కదియుఁగాని తన్ను వదల దేమియును | ॥మందు॥ |
| మనసు లోపలనుండి మరి మీఁదఁ దానుండి యెనసిన తిరువేంకటేశుని తనరిన తలఁపునఁ దలఁప దుష్కృతములు తనకుఁ దానే వీడుఁ దలఁకవలదు గాన | ॥మందు॥ |


