అధ్యాత్మ సంకీర్తన
రేకు: 27-1
సంపుటము: 1-162
రేకు: 27-1
సంపుటము: 1-162
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ఆహిరి
| ఏమీ నెఱఁగని మమ్ము నెక్కువ సేసి పామరుల దొడ్డఁ జేసె భాష్యకారులు | ॥ఏమీ॥ |
| గతచన్నవేదాలు కమలజునకు నిచ్చి అతని కరుణచేత నన్నియుఁ గని గతిలేకపోయిన కలియుగమున వచ్చి ప్రతిపాలించఁగలిగె భాష్యకారులు | ॥ఏమీ॥ |
| లోకమెల్ల వెల్లిఁబోఁగా లోననే సురలఁ గాచి ఆకుమీఁదఁ దేలిన యతని కృప కాకరిమతములెల్ల గాలిఁబుచ్చి పర మిట్టే పైకొనఁగఁ గరుణించె భాష్యకారులు | ॥ఏమీ॥ |
| పంకజపుఁ జేయి చాఁచి పాదపుఁ బరమిచ్చిన- వేంకటేశు కృపతోడ వెలయఁ దానే తెంకినే వొడయవరై తిరుమంత్రద్వయాన పంకమెల్లఁ బోఁ గడిగె భాష్యకారులు | ॥ఏమీ॥ |


