Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 27-4
సంపుటము: 1-165
సంస్కృతకీర్తన
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: సామంతం
సతతం శ్రీశం
హితం పరాత్పరమీడే
॥సతతం॥
గదాధరం మేఘగంభీరని-
నదం పరమోన్నతశుభదం
మృదుతరగమనం మేదినీధరం
హృదయనిలయ మహ మీడే
॥సతతం॥
నందకధరం జనార్దనం గో-
విందం చారుముకుందం
నందగోపవరనందనకందం
యిందురవినయన మీడే
॥సతతం॥
గరుడగమన మురగశయన మధికం
పరమపదేశం పావనం
తిరువేంకటగిరిదేవ మతులం మ-
హిరమణం స్థిర మీడే
॥సతతం॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము