Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 27-7
సంపుటము: 1-168
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: గుండక్రియ
తుదలేని బంధము తోడునీడై నేను
వదలినా నన్ను వదల దేమి సేతు
॥తుదలేని॥
గులిమి కొలుచు దీరఁ గుడువనియ్యక కొత్త
కొలుచు మీఁదమీఁదఁ గొలవఁగా
కలసిన కర్మపుఁ గలిమిచేతఁ [1]దృష్ణ
వెలితిగాక యిల్లు వెడల దేమి సేతు
॥తుదలేని॥
అన్నియు నొకమాటే యనుభవింపఁగఁ జేసి
కొన్ని వెచ్చము [2]లొనఁగూడించి
యిన్నిటాఁ దిరువేంకటేశ నిర్మలునిఁగా
నన్నుఁ జేసి నీవు నాకుఁ గలుగవయ్య
॥తుదలేని॥

[1] ‘దృష్ట’ పూ.ము.పా.

[2] ‘లొనఁగూడించి’లో అరసున్న చింత్యము.
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము