అధ్యాత్మ సంకీర్తన
రేకు: 28-6
సంపుటము: 1-174
రేకు: 28-6
సంపుటము: 1-174
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: లలిత
| వలవని మోహావస్థలఁ బొరలెడి మలినం బెన్నఁడు మానును | ॥వలవని॥ |
| ఘోరదురితవికారంబుల కారణ మెన్నఁడు దీరును వైరముగొని తను వదలని బంధపు భారం బెన్నఁడు వాయును | ॥వలవని॥ |
| జడమగు జిహ్వచాపల్యముగల వెడమతి యెన్నండు వీడును చెడని జీవునకు శ్రీవేంకటపతి కడచూ పెన్నఁడు గలుగును | ॥వలవని॥ |


