Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 28-7
సంపుటము: 1-175
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: లలిత
ఆశాబద్ధుఁడనై యలసి నిన్నుఁ గడు
గాసిఁ బెట్టినవాఁడఁ గాను
॥ఆశా॥
ఘనకర్మపరుఁడనై కర్మరూపునిఁ జేయ
నిను దూరి భారము నీకుఁ గట్టినవాఁడఁ గాను
పనిలేని దుఃఖలంపటుఁడనై దుఃఖము
గనుపించకుమని కడువేఁడినవాఁడఁ గాను
॥ఆశా॥
శ్రీవేంకటగిరిదేవేశ నాకిది
గావలె ననువాఁడఁ గాను
కావలసినయవి గదిసిన నవి నాకు
గావను మనుజుండఁ గాను
॥ఆశా॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము