అధ్యాత్మ సంకీర్తన
రేకు: 29-1
సంపుటము: 1-176
రేకు: 29-1
సంపుటము: 1-176
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: శ్రీరాగం
| కోరికె దీరుట యెన్నఁడు గుణమును నవగుణమునుఁ జెడి వూరక యీమది నీపై నుండుట యెన్నఁడొకో | ॥కోరికె॥ |
| చిత్తం బాఁకలి దీరదు చింత దలంపునఁ బాయదు యెత్తిన పరితాపమునకు నేదీ మితిమేర హత్తిన పుణ్యము బాపము నప్పటి సుఖముల కొరకే వత్తికి నూనెఁకు గొలఁదై వడిఁ జనె దివసములు | ॥కోరికె॥ |
| జీవుఁడె పరతంత్రుఁడుగన చింతింపఁడు నిన్నెప్పుడు చావునుఁ బుట్టుగు సహజము శరీరధారులకు శ్రీవనితాహృదయేశ్వర శ్రీవేంకటగిరివల్లభ పావనమతిమై ప్రాణులు బ్రదుకుట యెన్నఁడొకో | ॥కోరికె॥ |


