Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 29-5
సంపుటము: 1-180
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: లలిత
మనసున నెప్పుడు మానదిది
దినబాధెటువలె దీఱీనో
॥మనసు॥
చిత్తవికారము జీవుల పాపము
తత్తరపరచక తడయ దిది
కత్తులబో నీకాయపు వయసున
నెత్తిన మదమున కేదిగతో
॥మనసు॥
అసలుఁ గంబ మీయాశాదోషము
విసిగిన నూరక విడువ దిది[1]
వసులమూఁట మోవఁగఁ బడవేయఁగ
వసము గాని దెటువలెనౌనో
॥మనసు॥
పాము చెలిమి రంపపు సంసారము
గాముల మోఁచిన గంప యిది
కామించుచు వేంకటపతిఁ దలఁపక
యేమరివుండిన నేమౌనో
॥మనసు॥

[1] ‘ఇది + పసుల’.
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము