అధ్యాత్మ సంకీర్తన
రేకు: 3-6
సంపుటము: 1-19
రేకు: 3-6
సంపుటము: 1-19
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ముఖారి
చిత్తములో నిన్నుఁ జింతించనేరక మత్తుఁడఁనై పులుమానిసినైతి | ॥చిత్తము॥ |
అరుత లింగము గట్టి యది నమ్మఁజాలక పరువతమేఁగిన బత్తుడఁ నైతి సరుస మేఁకపిల్లఁ జంకఁ బెట్టుక [1]నూఁత- నరయు గొల్లని రీతి నజ్ఞాని నైతి | ॥చిత్తము॥ |
ముడుపు కొంగునఁ గట్టి మూలమూలల వెదకే వెడమతినై నే [2]వెర్తుడ నైతి విడువ కిక్కడ శ్రీవేంకటేశ్వరుఁ డుండ పొడగానక మందబుద్ధి నేనైతి | ॥చిత్తము॥ |
[1] ఇందరసున్న చింత్యము.
[2] ‘వ్యర్థ’ శబ్దభవము కావచ్చు.