అధ్యాత్మ సంకీర్తన
రేకు: 3-7
సంపుటము: 1-20
రేకు: 3-7
సంపుటము: 1-20
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: శ్రీరాగం
| అన్నియును నతని కృత్యములే యెన్నియైనా నవు నతఁడేమి సేసినను | ॥అన్ని॥ |
| అణురేణుపరిపూర్ణుఁ డవలిమోమైతేను అణువౌను కమలభవాండమైన ఫణిశయనుని కృపాపరిపూర్ణమైతే తృణమైన మేరువౌ స్థిరముగా నపుడే | ॥అన్ని॥ |
| పురుషోత్తముని భక్తి పొరపొచ్చమైతేను ఎరవులౌ నిజసిరులు ఎన్నైనను హరిమీఁది చింత పాయక నిజంబైతే నిరతిఁ బట్టినవెల్లా నిధానములే | ॥అన్ని॥ |
| మదనగురుని సేవ మదికి వెగటైతేను పదివేలు పుణ్యములు పాపంబులే పదిలమై వేంకటపతి భక్తి గలిగితే తుదిపదంబునకెల్ల దొడవవు నపుడే | ॥అన్ని॥ |


