Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 33-2
సంపుటము: 1-203
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ముఖారి
పసలేని యీబ్రదుకు
అసలు చొచ్చిచొచ్చి అలసినట్టాయె
॥పస॥
తొల్లిటి జన్మాదులఁ గాని నరరూపు
పల్లించుకొన్న యీబ్రదుకు
కల్లసుఖములచే కనలి కమ్మర
ముల్లుదీసి కొఱ్ఱు మొత్తినట్టాయ
॥పస॥
బూటకములనెల్లఁ బొరలి సంసారంపు
పాటు దెచ్చిన యీబ్రదుకు
నీటుగ నెద్దు దన్నీనని గుఱ్ఱము
చాటు కేఁగినయట్టి చందమాయె
॥పస॥
పగగొన్న పొగ కోపక మంటఁ బడిపడి
పగలు రేలైన యీబ్రదుకు
తగువేంకటేశ్వరుఁ దలఁచి నేల నుండి
యెగసి మేడమీఁది కేఁగినట్లాయె
॥పస॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము