అధ్యాత్మ సంకీర్తన
రేకు: 33-3
సంపుటము: 1-204
రేకు: 33-3
సంపుటము: 1-204
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ముఖారి
| ఎంత మానుమన్నఁ జింతలేల మానునే[1] పంతపు మనసు హరిపై నుంటేఁ గాక | ॥ఎంత॥ |
| తీరని బంధాలు నేఁడే తెగుమంటే నేల తెగు[2] భారపు మమతఁ బెడఁబాసినఁ గాక వూరటగా మమత నేనొల్లనంటే నేల మాను వోరువుతో లంపటము లొల్లకుంటేఁ గాక | ॥ఎంత॥ |
| వేఁకపుఁ గోపము నేఁడే విడుమంటే నేల విడు తోఁక చిచ్చయిన యాసఁ దుంచినఁ గాక ఆఁకట నాసేల మాను అన్నిటాను యిందరికి మాఁకుపడి తత్తరము మఱచుంటేఁ గాక | ॥ఎంత॥ |
| పెట్టనిది దైవ మిట్టే పెట్టుమంటే నేల పెట్టు యిట్టే వేంకటపతి యిచ్చినఁ గాక యిట్టునట్టు నీతఁడు దా నిందరికి నేల యిచ్చు వొట్టిన విరక్తి నేమి నొల్లకుంటేఁ గాక | ॥ఎంత॥ |
[1] నిడురేకు 42, 88- మానును.
[2] నిడురేకు 88- దీరుమంటే నేలతీరు.


