అధ్యాత్మ సంకీర్తన
రేకు: 35-3
సంపుటము: 1-216
రేకు: 35-3
సంపుటము: 1-216
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: శ్రీరాగం
| వేదనఁ బొరలే వెరవేలా యీ దయ విధి దన కీయదా | ॥వేదన॥ |
| తత్తరపాట్ల తనువికారములఁ జిత్తము దెంచే చెలువేలా బత్తితో దాఁచిన పరధనంబు[1]గొని సత్తయి వుండుట చాలదా | ॥వేదన॥ |
| యెక్కువ తమకపుటింతులఁ బొందక వక్కుచు వాడే వయసేలా మొక్కుచు దాఁచిన మూలధనము గన- నెక్కువ దైవం బియ్యదా | ॥వేదన॥ |
| సేఁతలఁ బొరలెడి చిక్కులఁ గెరలెడి రోఁతల యీనేరుపులేలా బాఁతిగ వేంకటపతిరతిఁ జిత్తపు- టూఁతలఁ గోరిక లూనవా | ॥వేదన॥ |
[1] ‘గని’ రేకు.


