అధ్యాత్మ సంకీర్తన
రేకు: 35-5
సంపుటము: 1-218
రేకు: 35-5
సంపుటము: 1-218
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ఆహిరి
| ఏమి గలిగెను మా కిందువలన వేమారుఁ బొరలితిమి వెఱ్ఱిగొన్నట్లు | ॥ఏమి॥ |
| తటతటన నీటిమీఁదట నాలజాలంబు లిటునటుఁ జరించవా యీఁది యీఁది అటువలెనెపో తమకమంది సంసారంపు ఘటనకై తిరిగితిమి కడ గానలేక | ॥ఏమి॥ |
| దట్టముగఁ బారావతముల మిన్నుల మోవ కొట్టఁగొన కెక్కవా కూడి కూడి వట్టియాసలనే యిటువలెనేపో యిన్నాళ్ళు బట్టబయ లీఁదితిమి పనిలేని పాట | ॥ఏమి॥ |
| బెరసి కుమ్మరపురువు పేఁడలోపలనెల్ల పొరలదా పలుమారుఁ బోయిపోయి వరుస జన్మముల నటువలెనె(పో?) పొరలితిమి తిరువేంకటాచలాధిపుఁ దలఁచలేక | ॥ఏమి॥ |


