అధ్యాత్మ సంకీర్తన
రేకు: 36-3
సంపుటము: 1-222
రేకు: 36-3
సంపుటము: 1-222
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: వరాళి
| తనవారని యాసఁ దగిలి భ్రమయనేల [1]తనువుఁ బ్రాణునికంటె తగులేది | ॥తన॥ |
| తనువుఁ బ్రాణుడు రెండు తగిలి గర్భమునందు వొనర నేకమై యుదయించి దినములు చెల్లిన తివిరి యాప్రాణుఁడు తనువు విడిచిపోయ దయలేక | ॥తన॥ |
| ప్రాణికై దేహము పాపపుణ్యముసేయు ప్రాణి వెంటనె బొంది పాశుండదు ప్రాణి యచ్చటనైన బాధలఁ బడకుండ ప్రాణి రక్షించు బొంది బడి దాఁ బోయనా | ॥తన॥ |
| యెరవుల దేహాలివి నిజమని నమ్మి యెరిఁగీ నెఱుఁగలే రిది యాలా అరయఁ బరమునకు నాది[2]పురుషుఁడై పరగు శ్రీవేంకటపతి గలిగుండఁగా | ॥తన॥ |
[1] ‘తనువుఁబ్రాలు’ ఇందలి అరసున్న చింత్యము. సముచ్చయమేమో? ‘ప్రాణుఁడు’ కూడ విచిత్రమే. ‘జీవుఁడు’ కావచ్చు.
[2] ‘పురుషుఁడే’ రేకు.


