Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 36-4
సంపుటము: 1-223
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: సామంతం
సకల భూతదయ చాఁలఁగ గలుగుట
ప్రకటించి దేహసంభవమైన ఫలము
॥సకల॥
తలకొన్న ఫలవాంఛఁ దగులకుండఁగఁ జిత్త-
మలవరించుట కర్మియైన ఫలము
పలుకర్మములలోన బ్రహ్మార్పణపుబుద్ధి
గలుగుట హరికృప గలిగిన ఫలము
॥సకల॥
యెప్పుడుఁ దిరువేంకటేశు సేవకుఁడౌట
తప్పక జీవుఁడు దానైన ఫలము
కప్పిన సౌఖ్యదుఃకర్మము(ఖమ్ము?)లు సమముగా
నొప్పుట విజ్ఞానమొదవిన ఫలము
॥సకల॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము