అధ్యాత్మ సంకీర్తన
రేకు: 37-2
సంపుటము: 1-228
రేకు: 37-2
సంపుటము: 1-228
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ముఖారి
| సిరి దొలంకెడి పగలు చీకఁటా యితఁడేమి యిరవు దెలిసియుఁ దెలియనియ్యఁ డటుగాన | ॥సిరి॥ |
| తలపోయ హరినీలదర్పణంబో ఇతఁడు వెలుఁగుచున్నాడు బహువిభవములతోడ కలగుణం బటువలెనె కాఁబోలు లోకంబు గలదెల్ల వెలిలోనఁ గనిపించుఁ గాన | ॥సిరి॥ |
| మేరమీరిన నీలమేఘమో యితఁడేమి భూరిసంపదలతోఁ బొలయుచున్నాడు కారుణ్యనిధియట్ల కాఁబోలు ప్రాణులకు కోరికలు దలఁపులోఁ గురియు నటుగాన | ॥సిరి॥ |
| తనివోని ఆకాశతత్వమో యితఁడేమి అనఘుఁడీ తిరువేంకటాద్రివల్లభుఁడు ఘనమూర్తి అటువలెనె కాఁబోలు సకలంబు తనయందె యణఁగి యుద్భవమందుఁ గాన | ॥సిరి॥ |


