అధ్యాత్మ సంకీర్తన
రేకు: 38-1
సంపుటము: 1-231
రేకు: 38-1
సంపుటము: 1-231
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: దేసాక్షి
| వేసరితి [1]మెట్ల నీవెంటఁ దిరిగి గాసిఁ బెట్టక మమ్ముఁ గావరాదా | ॥వేసరితి॥ |
| తీసితివి కోరికల తెగనీక పంచలకు తోసితివి యింటింటఁ దోయఁదోయ చేసితివి నీచేఁత చెల్లె నిఁకనైనను ఆస నీపొందొల్ల మంపరాదా | ॥వేసరితి॥ |
| కట్టితివి కర్మముల కడదాఁక నాపదలఁ బెట్టితివి దుఃఖములఁ బెనచిపెనచి పట్టితివి చలము మము పాయనని యాస నీ- విట్టైన గొంత సుఖ మియ్యరాదా | ॥వేసరితి॥ |
| కఱపితివి పాపములే కడఁగి నానావిధుల నెఱపితివి దుర్దశలే నేర్పుమెరసి తెఱఁ గొసంగియును శ్రీతిరువేంకటేశ్వరుని- నెఱిఁగియును నెఱఁగలే మింక నేతెరువో | ॥వేసరితి॥ |
[1] మెట్లు = కొండలు కావచ్చు.


