అధ్యాత్మ సంకీర్తన
రేకు: 38-2
సంపుటము: 1-232
రేకు: 38-2
సంపుటము: 1-232
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: సామంతం
| నీవనఁగ నొకచోట నిలిచివుండుటలేదు నీవనుచుఁ గనుఁగొన్న నిజమెల్ల నీవే | ॥నీవనఁగ॥ |
| తనయాత్మవలెనె భూతములయాతుమలెల్ల ననయంబుఁ గనుఁగొన్న యతఁడే నీవు తనుఁ గన్నతల్లిఁగా తగ నితరకాంతలను అనఘఁడై మదిఁజూచు నతఁడే నీవు | ॥నీవనఁగ॥ |
| సతతసత్యవ్రతాచారసంపన్నుఁడై అతిశయంబుగ మెలఁగు నతఁడే నీవు [1]ధృతిమాలి ద్రవ్యంబు తృణముగా భావించు హతకాముకుఁడైన యతఁడే నీవు | ॥నీవనఁగ॥ |
| మోదమున సుఖదుఃఖములు నొక్కరీతిగా నాదరింపుచునున్న యతఁడే నీవు వేదోక్తమతియైన వేంకటాచలనాథ ఆదియును నంత్యంబు నంతయును నీవే | ॥నీవనఁగ॥ |
[1] ‘దృతి’ రేకు.


