అధ్యాత్మ సంకీర్తన
రేకు: 38-3
సంపుటము: 1-233
రేకు: 38-3
సంపుటము: 1-233
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ముఖారి
| ఎవ్వరికైనను యీవ్రాఁత । నను నవ్వులు సేసెఁ బో నావ్రాఁత | ॥ఎవ్వరి॥ |
| తొలిజన్మంబున దోషకారియై నలుగడఁ దిప్పెను నావ్రాఁత యిల దుర్గణముల కీజన్మంబున నలఁకువ సేసెఁ బో నావ్రాఁత | ॥ఎవ్వరి॥ |
| పురుషునిఁ జే శల్పుని ననిపించుట నరజన్మమునకు నావ్రాఁత తరుచయ్యిన పాతక మరుపెట్టుక నరకము చూపెఁ బో నావ్రాఁత | ॥ఎవ్వరి॥ |
| [1]పామఱితనమున బహువేదనలను నామన సెనసెఁ బో నావ్రాఁత కామితఫలు వేంకటపతినిఁ గొలిచి నామతి దెలిపెఁ బో నావ్రాఁత | ॥ఎవ్వరి॥ |
[1] ‘పామరుతనము’ కావచ్చు.


