అధ్యాత్మ సంకీర్తన
రేకు: 39-2
సంపుటము: 1-238
రేకు: 39-2
సంపుటము: 1-238
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: సామంతం
| పాయపు మదముల బంధమా మము [1]జీయని యిఁకఁ గృప సేయఁగదో | ॥పాయపు॥ |
| ధనధాన్యములై తనులంపటమై పనిగొంటివి నను బంధమా [2]దినదినంబు నునుతీదీపులఁ బెను- గనివైతివి యిఁక గావఁగదో | ॥పాయపు॥ |
| సతులై సుతులై చలమై కులమై పతివైతివి వోబంధమా రతిఁ బెరరేఁపుల రంతుల యేఁపుల గతిమాలితి విఁక గావఁగదో | ॥పాయపు॥ |
| పంటై పాఁడై బలుసంపదలై బంటుగ నేలితి బంధమా కంటి మిదివో వేంకటగిరిపై మా- వెంటరాక తెగి విడువఁగదో | ॥పాయపు॥ |
[1] ‘జేయని’ పూ.ము.పా.
[2] ‘దినదినంబును నుతి దీపులఁ’ పూ.ము.పా.


