అధ్యాత్మ సంకీర్తన
రేకు: 39-5
సంపుటము: 1-241
రేకు: 39-5
సంపుటము: 1-241
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: శ్రీరాగం
| అంగడి నెవ్వరు నంటకురో యీ దొంగలఁ గూడిన ద్రోహులను | ॥అంగడి॥ |
| దోసము దోసము తొలరో శ్రీహరి దాసానదాసుల దగ్గరక ఆసలనాసల హరినెఱఁగక చెడి వీసర పోయిన వెఱ్ఱులను[1] | ॥అంగడి॥ |
| పాపము పాపము పాయరో కర్మపుఁ దాపపువారము దగ్గరక చేపట్టి వేదపు శ్రీహరికథలు యేపొద్దు వినని హీనులము | ॥అంగడి॥ |
| పంకము పంకము పైకొని రాకురో కొంకుఁ గొసరుల కూళలము వేంకటగిరిపై విభుని పుణ్యకథ లంకెల వినని యన్యులము | ॥అంగడి॥ |
[1] ‘వెఱ్ఱులము’ కావచ్చు.


