అధ్యాత్మ సంకీర్తన
రేకు: 40-2
సంపుటము: 1-244
రేకు: 40-2
సంపుటము: 1-244
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: కాంబోది
| తెల్లవారనియ్యరో తెరువు యీ- పల్లదపు దొంగలెల్లఁ బారాడు తెరువు | ॥తెల్లవార॥ |
| దొంతరపూవులతోఁట తూరుపుఁ దెరువు చింతపూవుఁ దేనెల చెమ్మతెరువు సంతులేని సతియింటిచాయ తెరువు యింతలోనె చలిఁబడి యెండదాఁకే తెరువు | ॥తెల్లవార॥ |
| పాముపుట్టగొంటిమీఁది పడుమటి తెరువు చీమకదొంతరలోని చిన్న తెరువు గాములు గాచుక యుండే గాలి తెరువు యేమిటా నెక్కడవుత నెరఁగని తెరువు | ॥తెల్లవార॥ |
| అన్ని దిక్కులునుఁ దానేయైవున్న తెరువు పన్నీటి కాలువల బాట తెరువు కన్నుల వేంకటపతిఁ గన్న తెరువు మిన్ను నేలఁ గూడిన మీఁది తెరవు | ॥తెల్లవార॥ |


