అధ్యాత్మ సంకీర్తన
రేకు: 40-3
సంపుటము: 1-245
సంస్కృతకీర్తన
రేకు: 40-3
సంపుటము: 1-245
సంస్కృతకీర్తన
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: శ్రీరాగం
| [1]నమో నారాయణాయ నమః సమధికానందాయ సర్వేశ్వరాయ | ॥నమో॥ |
| [2]ధరణీసతీఘనస్తనశైలపరిరంభ- పరిమళశ్రమజలప్రమదాయ సరసిజనివాసినీసరసప్రణామ[3]యుత- చరణాయ తే నమో [4]సకలాత్మకాయ | ॥నమో॥ |
| సత్యభామాముఖాంచనపత్రవల్లికా- నిత్యరచనక్రియానిపుణాయ కాత్యాయనీస్తోత్రకామాయ తే నమో ప్రత్యక్షనిజపరబ్రహ్మరూపాయ | ॥నమో॥ |
| దేవతాధిపమకుటదివ్యరత్నాంశుసం- భావితామలపాదపంకజాయ కైవల్యకామినీకాంతాయ తే నమో శ్రీవేంకటాచల శ్రీనివాసాయ | ॥నమో॥ |
[1] ఈ పాటలో నమశ్శబ్దముపై కొన్నిసంధులు వింతైనవి.
[2] ‘ధరణిసతి’ పూ.ము.పా.
[3] ‘యత’ రేకు.
[4] ‘సకళా’ రేకు; పూ.ము.పా.


