అధ్యాత్మ సంకీర్తన
రేకు: 40-4
సంపుటము: 1-246
రేకు: 40-4
సంపుటము: 1-246
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: సామంతం
| పాపినైన నాపాలఁ గలిగి తోవ చూపమన్న నెందుఁ జూపరు | ॥పాపి॥ |
| ధృతిమాలి జగమెల్లఁ దిరిగి వేసరితి యితరాలయముల కేఁగియేఁగి వేసరితి గతిమాలి పరులపైఁ గనలి వేసరితి మతిమాలి కులవిద్య మాని వేసరితి | ॥పాపి॥ |
| విసిగి యాచారంబు విడిచి వేసరితి పస చెడి ప్రియములు పలికి వేసరితి కొసరి ద్రవ్యముపైఁ గోరి వేసరితి కసుగంది లోలోనె కాఁగి వేసరితి | ॥పాపి॥ |
| కోవిదులగువారిఁ గొలిచి వేసరితి దైవములందరిఁ దడవి వేసరితి శ్రీవేంకటేశుని సేవ మాని వట్టి- సేవలన్నియు నేఁ జేసి వేసరితి | ॥పాపి॥ |


