అధ్యాత్మ సంకీర్తన
రేకు: 40-5
సంపుటము: 1-247
రేకు: 40-5
సంపుటము: 1-247
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: శ్రీరాగం
| సకలశాస్త్రజ్ఞానసంపన్నుఁడట చిత్త- మొకటికినిఁ జొరదు విధియోగమౌఁ గాదో | ॥సకల॥ |
| [1]దొరతనంబట కలిమి దోడుగాదట మంచి- తరుణులట మోహమట [2]దైన్యంబట విరహమట దారిద్ర్యవివశుఁడౌనట చూడ నరయ నిది కర్మఫలమౌనో కాదో | ॥సకల॥ |
| రాజసన్మానమట రవణహీనత్వమట తేజమట నలువంకఁ [3]దిరిపెంబట వాజివాహనములట వాఁడి లేదట తొంటి- పూజఫలమిది వెలితిభోగమౌఁగాదో | ॥సకల॥ |
| యిల యెల్ల నేలునట ఇంట లేదట మిగుల బలిమిగలదట సదా పరిభవమట చెలువలర వేడుకల శ్రీవేంకటేశ్వరుని గొలువనేరని వెనకఁ గొరఁతలౌఁగాదో | ॥సకల॥ |
[1] ‘దొరతనఁబట’ రేకు.
[2] ‘దైన్యఁబట’ రేకు.
[3] ‘తిరిపెఁబట’ రేకు.


