అధ్యాత్మ సంకీర్తన
రేకు: 42-1
సంపుటము: 1-255
రేకు: 42-1
సంపుటము: 1-255
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: లలిత
| నీవేకా చెప్పఁజూప నీవె నీవెకా శ్రీవిభు ప్రతినిధివి సేనమొదలారి | ॥నీవే॥ |
| నీవేకా కట్టెదుర నిలుచుండి హరివద్ద దేవతలఁ గనిపించే దేవుఁడవు యేవంక విచ్చేసినాను యిందిరా[1]పతికి నిజ- సేవకుఁడవు నీవేకా సేనమొదలారి | ॥నీవే॥ |
| పసిఁడిబద్దలవారు పదిగోట్లు గొలువ దెసలఁ బంపులు వంపే ధీరుఁడవు వసముగా ముజ్జగాలవారి [2]నిందరిని నీ- సిసువులఁగా నేలిన సేనమొదలారి | ॥నీవే॥ |
| దొరలైన యసురుల తుత్తుమురు సేసి జగ- మిరవుగా నేలితి వేకరాజ్యమై పరగు సూత్రవతీపతివై వేంకటవిభు- సిరుల పెన్నిధి నీవే సేనమొదలారి | ॥నీవే॥ |
[1] ‘సతికి’ రేకు.
[2] ‘నిందఱినినీ’ పూ.ము.పా.


