అధ్యాత్మ సంకీర్తన
రేకు: 42-3
సంపుటము: 1-257
రేకు: 42-3
సంపుటము: 1-257
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: కన్నడగౌళ
| [1]పుండు జీవుల కెల్లఁ బుట్టక మానదు పుండు మాన మందు వోయఁ గదయ్య | ॥పుండు॥ |
| నెత్తురు నెమ్ములు నిండిన పుంటికి తిత్తిలో సోదించనేరా నిత్తెమూ వేనీళ్లఁ గడిగినాను మత్తిలి వుబ్బు మానదేలయ్యా | ॥పుండు॥ |
| చల్లఁగూడు వెట్టి చల్లఁగా | పొత్తు- లెల్లఁ బెట్టి బిగియించఁగాను కల్లగాదు చీము గారు తొమ్మిదిగండ్ల పిల్లలాఁ జాలఁ బెట్టెఁగదయ్యా | ॥పుండు॥ |
| ఆదినుండి పాకమైనది | యెవ్వ- రేదిరో మొక మేరుపడదు ఆదరించి వేంకటాధిప నీవింక సోదించి మానఁజూడఁగదయ్యా | ॥పుండు॥ |
[1]ఈపాటలో పూ.ము.పా.న ‘ప్రగ్రహ’ చిహ్నాలు లేవు.


