అధ్యాత్మ సంకీర్తన
రేకు: 43-2
సంపుటము: 1-262
రేకు: 43-2
సంపుటము: 1-262
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: సామంతం
| నారాయణ నీనామము బుద్ధిఁ జేరినాఁ జాలు సిరు లేమి బాఁతి | ॥నారాయణ॥ |
| ననుపైన శ్రీవిష్ణునామము | పేరు- కొనఁగానే తేఁకువ మీరఁగా ఘనమైన పుణ్యాలు గలుగఁగా | తమ- కనయముఁ బరమది యేమి బాఁతి | ॥నారాయణ॥ |
| నలువైన శ్రీహరినామము | మతిఁ- దలఁచిన నాబంధము లూడఁగా యెలమి దీనిఁ బఠియించినా | యీ- కలుషములేల కలుగు నెవ్వరికి | ॥నారాయణ॥ |
| వేంకటపతి నామవిభవము | కర్మ పంకములెల్లఁ బరిమార్పఁగా బింకమై తలఁపెడి ప్రియులకు | యెందు- నింక నీ సుఖమిది యేమి బాఁతి | ॥నారాయణ॥ |


