Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 43-7
సంపుటము: 1-267
సంస్కృతకీర్తన
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: కురంజి, అటతాళం
[1]మందరధర మధుసూదన
నందగోపనందనా
॥మందర॥
నరసింహ గోవింద నవనీతానంద
హరిముకుంద నయనారవింద
కరివరద గరుడగమనరూప
గురుచాపా యదుకులదీపా
॥మందర॥
భవదూర భయహర పరిపూర్ణామృత
భవనపాలన సురపాలన
భువనభూషణ పరపురుష పురాతన
నవభోగా కరుణాయోగా
॥మందర॥
పంకజాసననుత భవ్యనిర్మలపాద
పంకజ పరమ పరాత్పర
వేంకటశైలనివేశ శు-
భంకరా క్షేమంకరా
॥మందర॥

[1] ఇది హ్రస్వదీర్ఘాంతమైన తెలుగుసంబోధనములతో కూడినది.
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము