అధ్యాత్మ సంకీర్తన
రేకు: 44-2
సంపుటము: 1-269
సంస్కృతకీర్తన
రేకు: 44-2
సంపుటము: 1-269
సంస్కృతకీర్తన
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: శ్రీరాగం
| [1]నమో నారాయణాయ నారాయణాయ సగుణబ్రహ్మణే సర్వ- పారాయణాయ శోభనమూర్తయే నమో | ॥నమో॥ |
| నిత్యాయ విబుధసంస్తుత్యాయ నిత్యాధి- పత్యాయ మునిగణ[2]ప్రత్యయాయ సత్యాయ ప్రత్యక్షాయ [3]సన్మానససాం- గత్యాయ జగదవనకృత్యాయ తే నమో | ॥నమో॥ |
| అక్రమోద్ధతబాహువిక్రమాతిక్రాంత శుక్రశిష్యోన్మూలనక్రమాయ శక్రాదిగీర్వాణవక్రభయభంగని- ర్వక్రాయ నిహతారిచక్రాయ తే నమో | ॥నమో॥ |
| అక్షరాయాతినిరపేక్షాయ పుండరీ- కాక్షాయ శ్రీవత్సలక్షణాయ అక్షీణవిజ్ఞానదక్ష యోగీంద్రసం- రక్షానుకంపాకటాక్షాయ తే నమో | ॥నమో॥ |
| కరిరాజవరదాయ కౌస్తుభాభరణాయ మురవైరిణే జగన్మోహనాయ తరుణేందుకోటీరతరుణీ [4]మనస్త్సోత్ర- పరితోషచిత్తాయ పరమాయ తే నమో | ॥నమో॥ |
| పాత్రదానోత్సవప్రథిత వేంకటరాయ[5] ధాత్రీశకామితార్థప్రదాయ గోత్రభిన్మణిరుచిరగాత్రాయ రవిచంద్ర- నేత్రాయ శేషాద్రినిలయాయ తే నమో | ॥నమో॥ |
[1] చరణాంతములందు అంతటా ॥నారా॥ అనియే పూ.ము.పా. పల్లవి ప్రారంభము ‘నమో’. పాట కడపట “నారాయణాయ” పదము పూ.ము.పా.లో లేదు. పల్లవిలో ‘మ’ ప్రాస లేదు. ‘నారాయణాయ నమో’కు బదులు, ‘నమో నారాయణాయ’ పడినదేమో? రేకు ననుసరించి చరణాంతములందు ‘నమో’ గుర్తించితిని. {పల్లవి మొదటి తునుక పాట కడపట అనూచ్చారితమైనట్లున్నది. %%This is removed [AB]}
[2] ‘ప్రత్యాయా’ రేకు.
[3] ‘సన్మానసం గత్యాయ’ రేకు.
[4] ‘మనస్తోత్ర’ రేకు.
[5] ఇది సంబోధనమా?


