అధ్యాత్మ సంకీర్తన
రేకు: 45-5
సంపుటము: 1-277
రేకు: 45-5
సంపుటము: 1-277
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: సాళంగనాట
| ఎట్టివారికినెల్ల నిట్టికర్మములు మా- [1]యెట్టివారికి నింక నేది తోవయ్య | ॥ఎట్టి॥ |
| పాముఁ జంపినయట్టి పాతకమునఁ బెద్ద - పాముమీఁద నీకుఁ బవళించవలసె కోమలిఁ జంపిన కొఱఁతవల్ల నొక్క- [2]కోమలి నెదఁ బెట్టుకొని యుండవలసె | ॥ఎట్టి॥ |
| బండి విఱిచినట్టి పాతకమునఁ బెద్ద బండిబోయిఁడవై పనిసేయవలసె కొండ వెఱికినట్టి గుణమునఁ దిరుమల[3]- కొండమీఁద నీకుఁ గూచుండవలసె | ॥ఎట్టి॥ |
[1] ‘యిట్టి’ పూ.ము.పా. ‘మాయట్టి’ అనుదానికి ‘మాయెట్టి’ అను వ్యావహారికరూపము ఈ వాఙ్మయమున గలదు.
[2] ‘గోమలి’ పూ.ము.పా.
[3] ‘తిరుమలకొండ’ గూడా ‘వేంకటేశ’ ముద్రయేనేమో?


