అధ్యాత్మ సంకీర్తన
రేకు: 46-2
సంపుటము: 1-281
సంస్కృతకీర్తన
రేకు: 46-2
సంపుటము: 1-281
సంస్కృతకీర్తన
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: శ్రీరాగం
| భాలనేత్రానల ప్రబలవిద్యుల్లతా- కేలీవిహార లక్ష్మీనారసింహా | ॥భాల॥ |
| ప్రళయమారుత ఘోరభస్త్రికా [1]ఫూత్కార లలితనిశ్వాసడోలారచనయా కులశైలకుంభినీ కుముదహితరవి గగన- చలనవిధినిపుణ నిశ్చల నారసింహా | ॥భాల॥ |
| వివరఘనవదనదుర్విహసన నిష్ఠ్యూత - లవదివ్య[2]వరుషలాలాఘటనయా వివిధజంతువ్రాతభువన[3]మగ్నీకరణ నవనవప్రియ[4] గుణార్ణవ నారసింహా | ॥భాల॥ |
| దారుణోజ్జ్వల ధగద్ధగిత దంష్ట్రానల వి- కారస్ఫులింగసంగక్రీడయా వైరిదానవఘోరవంశభస్మీకరణ- కారణ ప్రకటవేంకట నారసింహ | ॥భాల॥ |
[1] ‘భూత్కార’ రేకు.
[2] ‘ప్రత్న-పురాతన; నూత్న-నూతన’ శబ్దములవలె ‘వర్ష-వరుష’ శబ్దములా?
[3] ‘మగ్నౌకరణ’ పూ.ము.పా. ‘అగ్ని’శబ్దమునకు, ‘అగ్నిసాత్’ వరకు అర్థము చెప్పుకొని ‘అగ్నీకరణ’ ప్రయోగించినట్లున్నది. నా యీ ఊహకు పై చరణములోని ‘భస్మీకరణ’ ప్రయోగముకూడ ఆధారము.
[4] ‘వివిధజంతు ... ప్రియ’ వరకుగల భాగము అంత సుఘటితార్థము కాదు.


