Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 46-4
సంపుటము: 1-283
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: నాట
మానఁ డెన్నఁడు శరీరి దు-
ర్మానబోధితుఁడు గాన
॥మానఁడె॥
పంచభూతవికారంబులు
పంచేంద్రియములూ
పంచమహాపాతకములకును
పంచివేసినవిగాన
॥మానఁడె॥
త్రైగుణ్యవికారంబులు
త్రైగుణ్యపుఁ దనువులు
శ్రీగురుఁడగు శ్రీవేంకటపతి
భోగయోగ్యములుగాన
॥మానఁడె॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము