అధ్యాత్మ సంకీర్తన
రేకు: 47-1
సంపుటము: 1-286
రేకు: 47-1
సంపుటము: 1-286
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ముఖారి
| ఏమీ నెఱఁగని నాకేడ పుణ్యము తామసుండఁ జుమ్మీ ముందరనున్న దైవమా | ॥ఏమీ॥ |
| పాతకపుఁ జేతులనే పట్టి నిన్నుఁ బూజించు- ఘాఁతుకుఁడ నాకు నెక్కడి పుణ్యము చేతనముఁ బోదిసేయు చిత్తము నీదేకాన రాతిబొమ్మఁ జుమ్మీ భారము నీది దైవమా | ॥ఏమీ॥ |
| వూనిన యెంగిలినోర నొప్పగు నిన్నుఁ బొగడు- హీనజంతువునకు నా కేఁటిపుణ్యము తేనెవూసి నీ విట్లాఁ దిప్పఁగానే తిరిగేటి- మానిబొమ్మఁ జుమ్మీ నామతిలోని దైవమా | ॥ఏమీ॥ |
| జాలిఁబడి సంసారజలధిలో మునిఁగేటి కూళఁడ నాకేఁటి తేఁకువపుణ్యము పాలువోసి పెంచిన నాపాలి వేంకటేశ నే [1]తోలిబొమ్మఁ జుమ్మీ కాతువుగాని దైవమా | ॥ఏమీ॥ |
[1] తోలుబొమ్మ కావచ్చు. ‘తోలు’ ఔపవిభక్తికమా?


