అధ్యాత్మ సంకీర్తన
రేకు: 47-3
సంపుటము: 1-288
రేకు: 47-3
సంపుటము: 1-288
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: భూపాళం
| ఆకాశమడ్డమా అవ్వలయు నడ్డమా శ్రీకాంతు భజియించు సేవకులకు | ॥ఆకాశ॥ |
| పాతాళ మడ్డమా బలిమథను దాసులకు భూతలం బడ్డమా పుణ్యులకును సేతుకైలాసములు చిరభూములిన్నియును పై త్రోవలట పరమ భాగవతులకును | ॥ఆకాశ॥ |
| అమరావ తడ్డమా హరిదాసులకు మహా- తిమిరంబు లడ్డమా దివ్యులకును కమలాసనుని లోకంబదియు నడ్డమా విమలాత్ములై వెలుఁగు విష్ణుదాసులకు | ॥ఆకాశ॥ |
| పరమపద మడ్డమా [1]బ్రహ్మాండధరుఁడైన ధర వేంకటేశ్వరుని దాసులకును యిరవైన లోకముల నిన్నిటా భోగించి వరుసలను విహరించు వరవైష్ణవులకు | ॥ఆకాశ॥ |
[1] ‘బ్రహ్మాండధరుఁడైన వేంకటేశ్వరుఁడు’ అను సమాసమధ్యమున ‘ధర’ శబ్దప్రయోగము వింత. ‘ధరలోని వేంకటేశ్వరుఁడు’ అని ముందు సమసించి, తరువాత ‘బ్రహ్మాండధరుఁడైన’ అను భాగముతో సమసింపవలెనేమో? చూ. 335 పాట.


