Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 47-5
సంపుటము: 1-290
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: భైరవి
హరిఁ గొలిచియు మరీ నపరములా
తిరముగ నతనినే తెలియుట గాకా
॥హరి॥
పంకజనాభుని పాదములు దలఁచి
యింకా మరియొక యితరములా
అంకెల నతనినే అతని దాసులనే
కొంకక నిజముగఁ గొలుచుటగాకా
॥హరి॥
పన్నగశయనుని బంట్లకు బంటై
కొన్నిటిపై మరి కోరికెలా
యిన్ని కోరికలు యిదియే తనకని
కొన్నది కోలై కోరుటగాకా
॥హరి॥
వీనుల వేంకటవిభు నామామృత -
మూనిన మతి మరియును రుచులా
తేనెలుగారెడి తీపు లతని నుతి
నానారుచులై ననుచుటగాకా
॥హరి॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము