అధ్యాత్మ సంకీర్తన
రేకు: 49-2
సంపుటము: 1-299
రేకు: 49-2
సంపుటము: 1-299
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: భూపాళం
| ఏలవచ్చీ యేలపోయీ నెందుండీఁ బ్రాణి తోలుతిత్తిలోనఁ జొచ్చి దుంక దూరనా | ॥ఏల॥ |
| పుట్టులేక నరకాలపుంగుడై తా నుండక యీ- పుట్టుగున కేల వచ్చీ పోయీఁ బ్రాణి పుట్టుచునే కన్న వారిఁ బుట్టినవారి నాసలఁ బెట్టిపెట్టి దుఃఖములఁ బెడరేఁచనా | ॥ఏల॥ |
| భూతమై యడవిలోఁ బొక్కుచుఁ దా నుండక యీ- బూతుజన్మమేల మోఁచెఁ బుచ్చిన ప్రాణి రాతిరిఁ బగలు ఘోరపుఁబాటు వడిపడి పాతకాలు చేసి యమబాధఁ బడనా | ॥ఏల॥ |
| కీటమై వేంకటగిరి కిందనైన నుండక యీ- చేటువాటుకేల నోఁచె చెల్లఁబో ప్రాణి గాటమైన సంపదల కడలేని పుణ్యాల- కోటికిఁ బడగెత్తక కొంచెపడనా | ॥ఏల॥ |


