అధ్యాత్మ సంకీర్తన
రేకు: 1-3
సంపుటము: 1-3
రేకు: 1-3
సంపుటము: 1-3
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: దేసాక్షి
హీనదశలఁ బొంది యిట్ల నుండుటకంటె నానావిధులను నున్ననాఁడే మేలు | ॥హీన॥ |
అరుదైన క్రిమికీటకాదులందుఁ బుట్టి పరిభవములనెల్లఁ బడితిఁ గాని యిరవైన చింత నాఁడింతలేదు యీ- నరజన్మముకంటె నాఁడే మేలు | ॥హీన॥ |
తొలఁగక హేయజంతువులయందుఁ బుట్టి పలువేదనలనెల్లఁ బడితిఁ గాని కలిమియు లేమియుఁ గాన నేఁ డెఱిఁగి నలఁగి తిరుగుకంటె నాఁడే మేలు | ॥హీన॥ |
కూపనరకమున గుంగి వెనకకు నేఁ బాపవిధులనెల్లఁ బడితిఁ గాని యేపునఁ దిరువేంకటేశ నా కిటువలె నాపాలఁ గలిగిన నాఁడే మేలు | ॥హీన॥ |