అధ్యాత్మ సంకీర్తన
రేకు: 50-5
సంపుటము: 1-308
రేకు: 50-5
సంపుటము: 1-308
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: శ్రీరాగం
| ఇదివో సంసారమెంత సుఖమో కాని తుదలేని దుఃఖమను తొడవు గడియించె | ॥ఇదివో॥ |
| పంచేద్రియంబులను పాతకులు దనుఁ దెచ్చి కొంచెపు సుఖంబునకుఁ గూర్పఁగాను మించి కామంబనెడి మేఁటి[1]తనయుండు జని- యించి దురితధనమెల్ల గడియించె | ॥ఇదివో॥ |
| పాయమనియెడి మహాపాతకుఁడు తనుఁ దెచ్చి మాయంపు సుఖమునకు మరుపఁగాను సోయగపు మోహమను సుతుఁడేచి గుణమెల్లఁ బోయి యీనరకమను పురము గడియించె | ॥ఇదివో॥ |
| అతిశయుండగు వేంకటాద్రీశుఁడను మహా- హితుఁడు చిత్తములోన నెనయఁగాను మతిలోపల విరక్తి మగువ జనియించి య- ప్రతియయి మోక్షసంపదలు గడియించె | ॥ఇదివో॥ |
[1] ‘తనయందు’ పూ.ము.పా.


