అధ్యాత్మ సంకీర్తన
రేకు: 61-3
సంపుటము: 1-312
సంస్కృతకీర్తన
రేకు: 61-3
సంపుటము: 1-312
సంస్కృతకీర్తన
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ధన్నాసి
| నందనందన వేణునాదవినోద ము- కుంద కుందదంతహాస గోవర్ధనధరా | ॥నంద॥ |
| రామ రామగోవింద రవిచంద్రలోచన కామ కామకలుషవికారవిదూరా ధామ [1]ధామవిభవత్ర్పతాపరూప దనుజని- ర్ధూమధామకరణచతుర భవభంజనా | ॥నంద॥ |
| [2]కమల కమలవాస కమలారమణ దేవో- త్తమ తమోగుణసతతవిదూర ప్రమదత్ర్పమదా[3]నుభవభావకరణ(?)[4] సుముఖ సుధానంద శుభరంజనా | ॥నంద॥ |
| పరమ పరాత్పర పరమేశ్వరా[5] వరద వరదామల వాసుదేవ చిర చిరఘననగ శ్రీవేంకటేశ్వర నర[6]హరినామ పన్నగశయనా | ॥నంద॥ |
[1] (నిడురేకు 50) దామ విభవప్రతాపరూప.
[2] ఔషధమా? వైద్యుడా?
[3] ప్రమదప్రమదా.
[4] కారణ.
[5] శ్వరపరావర వరదా.
[6] వరనామ పన్నగరాజ.


