అధ్యాత్మ సంకీర్తన
రేకు: 61-5
సంపుటము: 1-314
సంస్కృతకీర్తన
రేకు: 61-5
సంపుటము: 1-314
సంస్కృతకీర్తన
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ధన్నాసి
| దేవదేవం భజే దివ్యప్రభావం రావణాసురవైరి రఘుపుంగవం | ॥దేవ॥ |
| రాజవరశేఖరం రవికులసుధాకరం ఆజానుబాహు నీలాభ్రకాయం [1]రాజారి కోదండ రాజదీక్షా గురుం రాజీవలోచనం రామచంద్రం | ॥దేవ॥ |
| నీలజీమూతసన్నిభశరీరం [2]ఘనవి- శాలవక్షం విమలజలజనాభం తాలాహినగహరం ధర్మసంస్థాపనం భూలలనాధిపం భోగిశయనం | ॥దేవ॥ |
| పంకజాసనవినుత పరమ నారాయణం [3]శంకరార్జిత జనకచాపదళనం లంకావిశోషణం లాలితవిభీషణం వేంకటేశం సాధువిబుధవినుతం | ॥దేవ॥ |
[1] ‘రామునితో యుద్ధముచేసిన శత్రురాజులు అతనితో కోదండలాఘవముతో తాము విలువిద్య నేర్చిరి’ అను భావమున ఈ సమాసమేర్పడినదేమో? అప్పుడు ‘అరిరాజ’ సహజము. ‘రాజారి’ ప్రాసనిర్బంధము.
[2] ఈ వాఙ్మయమున ‘విశాలవక్షం’ తప్పుగాదు. ‘విశాలవత్సం’ కావచ్చు.
[3] ‘అర్చిత’ కావచ్చు. ‘జనకార్చిత శంకరచాపదళనం’ అను భావమేమో?


